భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ములుగు జిల్లా ఏస్పీ శభరీష్
కాకతీయ, ములుగు: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ములుగు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల, గోదావరి, జంపన్న వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఏస్పీ శభరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వరద నీటి ప్రవాహంలో ఉన్న వంతెనలు, కల్వర్టులు, రహదారుల పై నుంచి దాటరాదని, శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండకూడదని, తడిగా ఉన్న విద్యుత్ కరెంట్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లను తాకరాదని, గ్రామాల్లో చేపల వేటకు ఎవరూ...