ఓటర్ల జాబితాను సరి చూసుకోవాలి : గీసుగొండ ఇన్‌చార్జి ఎంపీడీవో పాక శ్రీనివాస్

కాకతీయ, గీసుగొండ: గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను సరిచూసుకొని అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఇన్చార్జి ఎంపీడీవో పాక శ్రీనివాస్ అన్నారు.మండల పరిషత్ కార్యాలయంతో పాటు మండలంలోని 21 గ్రామాల్లో ఫోటోతో కూడిన ఓటర్ల ముసాయిదా జాబితాను గురువారం పంచాయితీ కార్యదర్శులు గ్రామ నోటీసు బోర్డులపై ప్రదర్శించినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వార్డుల వారీగా జాబితాలో ఎవరైనా అభ్యంతరాలు తెలపదలచిన పక్షంలో ఈ నెల 30వ తేదీ వరకు తెలియజేయాలని ఆయన సూచించారు. అదే రోజున మండల పరిషత్...