ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో కొంతమంది ప్రధాని మోదీ తల్లిని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో మొహమ్మద్ రిజ్వి అలియాస్ రాజా కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సింగ్వారాలోని భాపుర గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దీనిపై ఇంకా...