నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలో చార్డర్డ్ ఎకౌంటెంట్లు భాగస్వాములు కావాలి: చార్డర్డ్ అకౌంటెంట్లకు మంత్రి లోకేష్ పిలుపు

కాకతీయ, అమరావతి: దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎపి లోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోంది... ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047నాటికి $2.4ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది మా లక్ష్యం. ఈ ప్రయాణంలో చార్డర్డ్ అకౌంటెంట్లు కంట్రిబ్యూటర్లుగా మాత్రమే కాకుండా మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐసిఎఐ (Institute of Chartered Accountants of India) ఆధ్వర్యాన అర్థసమృద్ధి – 2025 పేరిట వైజాగ్ కన్వెన్షన్స్ లో జరిగిన సదస్సులో మంత్రి లోకేష్...