జీహెచ్ఎంసీలో అవినీతి భాగోతం..రూ.56 లక్షలు కాజేసిన మహిళా ఆపరేటర్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీలో అవినీతి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ సర్కిల్‌ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పౌర సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళా కంప్యూటర్ ఆపరేటర్ సుభాషిణి రూ.56 లక్షల నిధులను కాజేసిన విషయం బయటపడింది. సాధారణంగా పౌరులు ట్రేడ్ లైసెన్స్, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను దరఖాస్తులు వంటి సేవల కోసం చెల్లించే ఫీజులు నేరుగా జీహెచ్ఎంసీ ఖాతాలో జమ చేయాలి. అయితే, సుభాషిణి వసూలు చేసిన మొత్తం డబ్బును ఖజానాలో జమ...