భారీ వర్షాలతో రైతన్నకు తీవ్ర నష్టం.. వెంటనే పరిహారం అందించాలి: బడే నాగజ్యోతి
కాకతీయ, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. శుక్రవారం తాడ్వాయి మండలంలోని ఊరట్టం, కన్నెపల్లి, నార్లపూర్ గ్రామాల్లో పంట పొలాలను సందర్శించిన ఆమె రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ వందలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు యా భైవేల రూపాయల...