పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి నాలుగు నెలల (ఏప్రిల్-జూలై) ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (సి ఏ జి ) కు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఈ కాలంలో రాష్ట్రం సాధించిన ఆదాయం బడ్జెట్‌ అంచనాల కంటే చాలా తక్కువగా ఉండగా, అప్పులు మాత్రం గణనీయంగా పెరిగినట్లు నివేదికలో స్పష్టమైంది. ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రాబడి అంచనాలను భారీగా ఉంచినా, ఆ అంచనాల్లో కేవలం 21 శాతం మాత్రమే నాలుగు...