ప్రమాదాల నివారణకే కాటమయ్య రక్ష కిట్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో : గీత కార్మికులు తాటి, ఈతచెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలు జరగకుండా కాటమయ్య రక్షక కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి 80 మంది లబ్ధిదారులకు కాటమయ్య రక్షక కిట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టమైనా కులవృత్తులను ప్రోత్సహించే దిశగా ప్రజా ప్రభుత్వం పలు కార్యక్రమాలు...