భారత్ , జపాన్ కలిస్తే అన్నీ అద్భుతాలే: టోక్యోలో ప్రధాని మోదీ..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్ వేగంగా అభివ్రుద్ధి చెందుతోందని, ప్రపంచ దేశాలు కేవలం మన వ్రుద్ధిని గమనించడమే కాకుండా మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని..టోక్యోలో జరిగిన భారత్, జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రస్తుతం భారత్ లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, పారదర్శక విధానాలు ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత...