జమ్మూ కాశ్మీర్ నగ్రోటాలో భారీ వర్షం.. తావి నదిలో వంతెన మునిగిపోయిన వీడియో వైరల్..!

కాకతీయ, నేషనల్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని నగ్రోటాలో కురుస్తున్న భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేశాయి. తావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా, నగ్రోటాలోని తవి నదిపై నిర్మించిన వంతెన ఒక్కసారిగా నదిలో మునిగిపోయింది. నదిలో వంతెన కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వంతెన పేరు నగోరోట బాబా పెడ్ దేవతా వంతెన అని చెబుతారు. ఈ వంతెన తావి నదిపై నిర్మించారు. ఇది పాదచారుల వంతెన....