ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. సంబరంతో పటాసులు కాల్చిన గ్రామస్తులు..!!
కాకతీయ, వీణవంక : పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ కథనం మేరకు.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు ఇంటి నిర్మాణానికి హౌస్ నెంబర్ కేటాయించడానికి రూ.20 వేల లంచం కావాలని బాధితుడిని డిమాండ్ చేశాడు. బాధితుడు ఈ విషయం పై ఏసీబీని ఆశ్రయించగా శుక్రవారం పంచాయతీ కార్యదర్శి బాధితుడి నుండి...