ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గించాలి: స్కూల్ యాజమాన్యాలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమావేశం

కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్కూల్ ట్రాన్స్‌పోర్టేషన్‌ కారణంగా వస్తున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం స్కూల్ యాజమాన్యాలతో సమావేశమయ్యారు. కమిషనరేట్‌లో జరిగిన ఈ సమావేశానికి జాయింట్ సీపీ ట్రాఫిక్ డా. గజారావు భూపాల్ ఐపీఎస్‌ నేతృత్వం వహించారు. సమావేశంలో విద్యార్థులు ఎక్కువగా స్కూల్ వాహనాలనే వినియోగించేలా ప్రోత్సహించడం, ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, స్కూల్ సమయాల్లో వ్యత్యాసం పాటించడం, కార్‌పూలింగ్ ప్రోత్సాహం, బస్సు డ్రైవర్లపై నిరంతర ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించడం వంటి అంశాలు...