భవన నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి: మంత్రి కోమటిరెడ్డి తనిఖీ
కాకతీయ, నల్గొండ : నల్గొండలో నిర్మాణంలో ఉన్న కొత్త కలెక్టర్ కార్యాలయ భవన పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులతో నిర్మాణం జరుగుతున్న ఈ కార్యాలయ భవనంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ విభాగం, మంత్రి ఛాంబర్ వంటి విభాగాలు ఏర్పాటు కానున్నాయి. పాత కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధిపతుల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, దానిని ఆధునీకరించాలని మంత్రి ఆదేశించారు. గ్రౌండ్...