తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: వై కుమార్ గౌడ్
కాకతీయ, జనగామ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై కుమార్ గౌడ్ గారు క్రీడాకారులు, క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని 'జాతీయ క్రీడా దినోత్సవం'గా జరుపుకోవడం గర్వకారణమన్నారు. "నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం నా కర్తవ్యం" అన్న ధ్యాన్ చంద్ గారి మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొయ్యడ మల్లేష్, మండల Ex...