తెలంగాణపై కేంద్రం చిన్నచూపు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కాకతీయ, గోదావరిఖ : తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్న చూపు చూస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఏంపీ గడ్డం వంశీ కృష్ణ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లడుతూ.. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించడం జరిగిందని, తెలంగాణకు వచ్చే కోటాను పూర్తిస్థాయిలో అందించాలని కేంద్ర మంత్రులకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. తొమ్మిది లక్షల టన్నుల యూరియాకు గాను నాలుగున్నర లక్షల టన్నులను మాత్రమే...