విశ్రాంత పోలీస్‌ అధికారులకు ఘన సన్మానం: సీపీ సన్ ప్రీత్ సింగ్

కాకతీయ, హనుమకొండ : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పదవీవిరమణ చేసిన పోలీస్‌ అధికారులను పోలీస్ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ అనంతరం అధికారులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. మీరు అందించిన సేవలు నేటి తరం పోలీసులకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. నేటి ప్రశాంత వాతావరణానికి మీ కృషి ప్రధాన కారణం అని సీపీ అన్నారు. ఈ సందర్భంగా పదవీవిరమణ పొందిన ఎస్‌.ఐలు యాకుబ్ మొహినూద్దీన్, మహమ్మద్ అలీ, రాధే...