రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.. మచ్చాపురం సెంటర్‌లో దిష్టిబొమ్మ దహనం.!!
కాకతీయ, గీసుకొండ: ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అవమానకర వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శనివారం మండలంలోని మచ్చాపురం గ్రామ సెంటర్‌లో బీజేపీ మండల అధ్యక్షులు చొక్కం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాహుల్ గాంధీ సంస్కారం ఎంత దిగజారిందో ఈ వ్యాఖ్యలతో తేలిపోయిందని విమర్శించారు. ప్రజల గౌరవానికి పాత్రులైన మాతృమూర్తిపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ దౌర్భాగ్యమని...