ఎరువుల సంక్షోభంపై బీఆర్ఎస్ వినూత్న నిరసన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నెలకున్న ఎరువుల కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గన్ పార్క్ వద్ద మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా అసెంబ్లీని తమకు అనుకూలంగా నడిపిస్తుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులపాటు జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏ అంశాన్నైనా సభలో పెట్టినా, తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు....