జిల్లాలో యూరియా కొరత తీర్చాలి:కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నేతలు
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ మూడు నెలలుగా జిల్లాలో యూరియా అందుబాటులో లేక రైతులు కష్టాలు పడుతున్నారని, రైతులు ఫర్టిలైజర్ షాపులు, సొసైటీ ఆఫీసులు చుట్టూ తిరిగినా యూరియా దొరకడం లేదని, కొందరు రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లలో నిలబడి నిరాశ చెందుతున్నారని తెలిపారు....