పంట వేయని రైతులకు పరిహారం ఇవ్వాలి.. వనదేవతలకు వినతిపత్రం అందజేత
కాకతీయ, ములుగు : ప్రతీ రెండేళ్లకోసారి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరను రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో, గిరిజన పూజారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 2026 జనవరిలో జరగనున్న జాతర కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. అయితే జాతర ఏర్పాట్ల దృష్ట్యా మేడారం పరిసర గ్రామాలైన ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం, నార్లపూర్, వెంగళాపూర్ ప్రాంతాల రైతులు వందల ఎకరాల పంట భూములను సాగు చేయకుండా బీడుగా ఉంచాల్సి వచ్చింది. దీంతో దాదాపు 2 వేల మంది రైతులు నష్టపోతున్నారని వారు...