ఆదర్శ కమ్యూనిస్టు సీతారాంరెడ్డి: సీపీఎం రాష్ట్ర నేత జి.నాగయ్య
కాకతీయ, నెల్లికుదురు: ప్రజల కోసం పరితపించే కమ్యూనిస్టు ఆదర్శప్రాయుడు నేలకుర్తి సీతారాం రెడ్డి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జి. నాగయ్య అన్నారు. మండలంలోని బంజర గ్రామానికి చెందిన నెలకుర్తి సీతారాం రెడ్డి సంతాప సభ శనివారం గుణగంటి రాజన్న అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జి నాగయ్య హాజరై మాట్లాడారు. చివరి శ్వాస దాకా కూడా కమ్యూనిస్టు కార్యకర్తగానే బ్రతికాడని, విప్లవ భావాలకు ఆకర్షితుడై పేద, బడుగుబలహీన వర్గాల ప్రజల కోసం చేసిన పోరాటాలు చేశారని...