మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి: బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

కాకతీయ, వరంగల్ : దేశం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని అకారణంగా దూషించడమే కాక ఆయన తల్లిపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ధ్వజమెత్తారు. వరంగల్ చౌరస్తాలో శనివారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ద్వేషపూరిత పార్టీ అని, దానికి విలువలంటూ లేవని, విద్వేషాలను రెచ్చగొట్టడమే ఆ పార్టీ...