చైనాలో ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్ ..7 ఏళ్ల తర్వాత తొలిసారి
కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధాని నరేంద్రమోదీకి చైనాలో ఘనస్వాగతం లభించింది. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ తియాంజిన్ కు చేరుకున్నారు. 2020లో లడఖ్ సరిహద్దులో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. చైనాలో చివరిగా 2018లో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్ విరుచుకుపడిన తరుణంలో మోదీ చైనా పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జపాన్ లో రెండు రోజుల పర్యటన తర్వాత...