రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎ. విజయ్ భాస్కర్

కాకతీయ, గీసుకొండ : అధిక వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. మండలంలోని పోతరాజుపల్లి, మాచాపూర్, గీసుకొండ, గంగదేవిపల్లి గ్రామాల్లో పత్తి, వరి, సోయా, పసుపు, కూరగాయ పంటలను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తల బృందం శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త డా. ఎ. విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, నివారణ చర్యగా వేపనూనె (1500...