మహిళలే దేశాభివృద్ధికి పునాది: వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
కాకతీయ, హనుమకొండ : మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి సాధ్యమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. భీమారం ఎం.టి.ఆర్ గార్డెన్స్‌లో గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలంటే దృఢసంకల్పం, అంకితభావంతో కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆడపిల్లలు నిర్ణయించుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఆమె అన్నారు. మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలంటే విద్య, నైపుణ్య శిక్షణతో పాటు...