వరంగల్ కమిషనరేట్ పరిధిలో 6683 గణేష్ విగ్రహాలు: పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
కాకతీయ హనుమకొండ : వరంగల్ కమిషనరేట్ పరిధిలో గణపతి నవరాత్రులు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, మొత్తం 6683 గణేష్ విగ్రహాలు నెలకొల్పారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. సెంట్రల్ జోన్‌లో 2675 విగ్రహాలు, ఈస్ట్ జోన్‌లో 2043 విగ్రహాలు, వెస్ట్ జోన్‌లో 1945 విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 50శాతం ఎక్కువగా గణేష్ మండపాలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా 6526 విగ్రహాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడం విశేషమన్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో మండపాలను సందర్శించి భద్రతా...