మంత్రి పదవి రేసులో ఉన్నా:ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చిట్‌చాట్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చర్చలు వేడెక్కుతున్న వేళ, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గ్గా మారాయి. మంత్రి పదవి రేసులో తన పేరు కూడా ఉన్నప్పటికీ, పార్టీ తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నారు. ముఖ్యంగా మైనార్టీ కోటాలో క్రికెటర్-తెరాస నేత మహ్మద్ అజారుద్దీన్‌కు అవకాశం ఇస్తే, తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తాను వ్యక్తిగత స్థాయిలో పోటీ పడే ఉద్దేశ్యం లేకుండా, పార్టీ ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి...