బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ అడ్డుకుంటోంది: సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై తమ ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తోందని అన్నారు. అయితే ఈ ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డుగా నిలుస్తోందని ఆయన మండిపడ్డారు. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గతంలోనే తమ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42...