స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో కీలకమైన బిల్లులకు ఆమోదం లభించింది. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ మున్సిపాలిటీల (మూడవ సవరణ) బిల్లు-2025, తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సవరణ) బిల్లు-2025లకు సభ వాయిస్ ఓటు ద్వారా మద్దతు తెలిపింది. ఈ బిల్లుల ద్వారా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఇంతవరకు అమలులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం ద్వారా మరింత పెద్దఎత్తున బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం లభించే అవకాశం...