ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి
కాకతీయ, బయ్యారం: మండలంలోని బాలాజీ పేట గ్రామంలో పెద్దఎత్తున ఉద్యమకారులతో ఆదివారం పోస్ట్ కార్డు కార్యక్రమం నిర్వహించినట్లు ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు అడిదల వీరభద్రం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండల ప్రధానకార్యదర్శి గుండగాని రామనాథం ఆధ్వర్యంలో జరిపారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యదర్శి సోమారపు వీరస్వామి, బయ్యారం మండల అధ్యక్షుడు అడిదల వీరభద్రం, మహబూబాబాద్ జిల్లా బాధ్యుడు రంగశాయిపేట వాసి సురకంటి పద్మయ్య పాల్గొన్నారు. ముఖ్యఅతిథి వీరస్వామి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు...