కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పై సభలో చర్చ జరగాల్సిందే: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పురపాలక చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేడు సభలో పెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రంలో బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివ్రుత్తి చేయాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పై సభలో చర్చ జరగాల్సిందే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అయ్యింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత బీసీలు అంతా...