కార్యకర్తలకు అండగా ఉంటాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
కాకతీయ, వరంగల్ : నగరంలోని రామన్నపేటలోని రఘునాథ్ కాలనీకి చెందిన బీజేవైఎం కార్యకర్త ఎలకలపెల్లి సురేష్ ఇల్లు శుక్రవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది. కాగా ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ స్థానిక బిజెపి నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వారి ఇల్లు పూర్తిగా దగ్ధమవడం బాధాకరమని సురేష్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. సురేష్ చిరు వ్యాపార సామగ్రి, నిత్యావసర...