కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: బడే నాగజ్యోతి
కాకతీయ, ములుగు : రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, అసెంబ్లీలో కాళేశ్వరంపైన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి అన్నారు. సోమవారం ములుగు మండలకేంద్రంలో జాతీయ రహదారి163పై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగుకోట్ల ప్రజల హక్కులను రేవంత్ రెడ్డి కాలరాచాడని ఆమె అన్నారు. పోరాటాలతో సాధించిన తెలంగాణ...