సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి:తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజ్జల రామ్ కిషన్, కన్వీనర్ ఫణి కుమార్
కాకతీయ, వరంగల్ : పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సోమవారం హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ నుండి వరంగల్ కలెక్టర్ కార్యాలయం వరకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ గజ్జల రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉద్యోగులకు పాత పెన్షన్...