డాక్టర్ వెంకటనారాయణ సేవలు మరువలేనివి: ఎంపీడీవో, పెద్ది ఆంజనేయులు

కాకతీయ, పరకాల : పరకాల మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కె. విజయ భాస్కర్ పశువైద్యాధికారిగా పదోన్నతిపై పెద్దపల్లి జిల్లాకు వెళ్ళిన సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల అధికారులు మాట్లాడారు. డాక్టర్ వెంకటనారాయణ పని చేసిన 6 నెలల్లో మండలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చాకచక్యంగా పరిపాలన సాగించారని కొనియాడారు. ఆయన సేవలు మరువలేనివి అన్నారు. అనంతరం ఆయనను శాలువా, మెమెంటో, పూలమాలలతో...