ములుగు జీపీలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..!!
ములుగు జీపీలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం రికార్డులో పేరు లేకున్నా ధ్రువపత్రం జారీ పైకం ఇస్తే ఏ పత్రమైనా అందుబాటులోకి..? విచారణ జరిపితే మరిన్ని వెలుగులోకి.. కాకతీయ, ములుగు : జిల్లా కేంద్రంలోని ములుగు గ్రామపంచాయతీ(మున్సిపాలిటీగా మారకముందు)లో నకిలీ ధ్రువపత్రాల బాగోతం బయటపడింది. చేతిలో అధికారం ఉన్నంత మాత్రాన లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ పత్రాలు జారీ చేసిన ఘటన వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పైకం చెల్లిస్తే ఏ ధ్రువపత్రమైనా జారీ చేస్తారన్న ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేపుతున్నాయి....