కాళేశ్వరం కమిషన్ పై హరీశ్ రావు పిటిషన్.. చర్యలు చేపట్టుకుండా ఆదేశాలివ్వలేమన్న హైకోర్టు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హరీశ్ రావు తరపున న్యాయవాది అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టాలంటూ కోరారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందంటూ కోర్టుకు తెలిపారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని కోర్టుకు ఏజీ తెలిపారు అన్నారు. అసెంబ్లీలో తీర్మానించకుండానే సిబిఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రేపటి వరకు తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన...