బయ్యారం మండలంలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

కాకతీయ, బయ్యారం: మండలంలో ఆదివారం రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షంతో ఏజెన్సీలోని వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కోయగూడెం, సుద్దరేవు గ్రామాల సరిహద్దుల్లో మసివాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో కంబాలపల్లి- కోయగూడెం మధ్య రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. పందిపంపుల వాగు ప్రమాదకరంగా ప్రవహించడంతో అల్లిగూడెం -కంబాలపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణ పురం వద్ద మసి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఇల్లందుకు వెళ్లే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ నాగరాజ్ మాట్లాడుతూ ఆదివారం 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం...