తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..ఐఎండీ అలర్ట్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాయవ్యబంగాళాఖాతంలో రానున్న 12గంటల నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని...