రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్
కాకతీయ పెద్దపల్లి: సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మధ్యం సేవించి మధ్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాధులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలపడం జరిగింది. మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం, అన్ని వర్గాల...