బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్.. నేడు, రేపు ధర్నాలకు పిలుపు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిగ్గా మారింది. కాళేశ్వరం రిపోర్టుపై రాష్ట్ర శాసనసభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బహిర్గతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు, రేపు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని సూచించారు. కేటీఆర్ సూచనల మేరకు మండల కేంద్రాల నుంచి జిల్లా ప్రధాన...