గృహ నిర్మాణ పనులలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి..!!
కాకతీయ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో నూతన గృహ నిర్మాణ పనులను చేపడుతున్న ఇంటి యజమానులు, బిల్డర్లు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, టైల్స్, మార్బుల్ పనులకు స్థానిక యూనియన్ కార్మికులనే నియమించుకోవాలని శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తాండ్ర సదానందం, సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మంద భాస్కర్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు కల్లేపల్లి రవి కోరారు. సోమవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానికేతర కార్మికులు తక్కువ ధరకు...