అఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం.. 622 మంది దుర్మరణం..1500 మందికి గాయాలు..!!
కాకతీయ, నేషనల్ బ్యూరో: ఆఫ్ఘనిస్తాన్ భారీ భూకంపాలతో వణికిపోయింది. ఆదివారం అర్థరాత్రి దేశంలో వరుసగా భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకంపనలు ఢిల్లీ NCR వరకు తాకాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం 6.3 తీవ్రత నమోదు అయ్యింది. ఈ ఘోర విపత్తు కారణంగా ఇప్పటి వరకు 622 మంది మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. మరో 15వందల మంది వరకు గాయపడినట్లు పేర్కొంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం..నంగర్హార్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ సమీపంలో భూకంప...