గణేష్ నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు: తహసీల్దార్ ఎండీ రియాజుద్దిన్
కాకతీయ, గీసుగొండ: గణేష్ నిమజ్జనంలో తహసీల్దార్ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకూడదని ఎం.డి.రియాజుద్దీన్ అధికారులతో అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 21 గ్రామాలు, గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15,16వ డివిజన్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల నుండి నిమజ్జన ప్రదేశాల వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జన ప్రదేశాల్లో పంచాయితీ కార్యదర్శులు,రెవెన్యూ, మెడికల్, పోలీసు సిబ్బందిస సమన్వయంతో పనిచేసి నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు....