‘గోదావరి’ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ దివాకర

కాకతీయ, ములుగు : సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావుకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 50 దరఖాస్తులు రాగా అత్యధికంగా గృహనిర్మాణ శాఖకు 09, భూ సమస్యలు...