అర్జీల పరిష్కారం సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ డి.వేణు
కాకతీయ పెద్దపల్లి: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లాగలమర్రి గ్రామానికి చెందిన గొర్రె సునీల్ నంది మేడారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో ఆరవ తరగతిలో సీటు ఖాళీగా ఉన్నందున ఆ...