తాడ్వాయి మండలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు..!!

కాకతీయ, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం ఉద్యమం పేరుతో తాడ్వాయి మండలం కాల్వపల్లి,ఊరట్టం,బయక్క పేటలో ఇటీవల మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం వాల్ పోస్టర్లను వెలిసించడంతో గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. పోస్టర్లో ప్రజాస్వామ్యబద్ధమైన శాంతియుత జీవనం మన హక్కు అని, గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ పల్లెలు, ఆదివాసి గూడెలు నక్సలైట్ల/మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి దిశగా సాగుతున్నాయని, ఒకప్పుడు అమాయక ఆదివాసులను అడ్డం పెట్టుకొని వారి ప్రాణాలను బలికొనిపెట్టి ఉనికిని కొనసాగించేందుకు...