సురవరం సుధాకర్ రెడ్డి భార్య సంచలన నిర్ణయం.. తమ ఆస్తిని ప్రజలకు ఇస్తున్నట్లు ప్రకటన

కాకతీయ, తెలంగాణ బ్యూరో: దేశ రాజకీయాల్లో ఎప్పుడూ సాధారణ ప్రజల సమస్యలపై గళమెత్తిన కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు దివంగత సురవరం సుధాకర్ రెడ్డి భార్య విజయలక్ష్మి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ వ్యక్తిగత ఆస్తులను సమాజానికి అంకితం చేస్తున్నట్లు వారు ఇటీవల ప్రకటించారు. ఈ నిర్ణయం సమాజంలో చర్చనీయాంశమవుతూ, ప్రజా సేవకు అంకితమైన జీవన విధానానికి ఒక నిదర్శనంగా నిలుస్తోంది. చాలా కాలంగా ప్రజా ఉద్యమాల్లో, కార్మిక, రైతు సమస్యల పరిష్కారంలో ముందుండే సుధాకర్ రెడ్డి, తన రాజకీయ జీవితమంతా వ్యక్తిగత లాభాలకంటే...