నాలుగేళ్ల స్థానికత అంశంపై కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలపై నెలకొన్న చట్టపరమైన వివాదానికి సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్థానికత నిబంధనను పూర్తిగా సమర్థిస్తూ, హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపులో స్థానిక విద్యార్థులకే ప్రాధాన్యం కల్పించే ప్రభుత్వ విధానం బలపడింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివిన విద్యార్థులకే స్థానికత అవకాశం ఉంటుంది. అంటే కనీసం...