బీసీల్లో అత్యధిక జనాభా యాదవులదే..మేమెంతో మాకంతా రిజర్వేషన్లు ఇవ్వాలి: వీరన్న యాదవ్
కాకతీయ ఇనుగుర్తి : బీసీ కులాల్లో అత్యధిక జనాభా యాదవులే కాబట్టి మే మెంతో మాకంత రిజర్వేషన్లు ఇవ్వాలని టీపీసీసీ ఓబీసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ మేకల వీరన్న యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం చిన్న బస్టాండ్ సెంటర్లో యాదవులతో కలిసి వీరన్న యాదవ్ గొల్ల కురుమల సదస్సు పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 5న జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్లో జరిగే గొల్ల కురుమ యాదవ సదస్సు కు యాదవులంతా సంకటితమై పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు....